కరోనాతో ముంబయి డిప్యూటీ కమిషనర్‌ మృతి

Update: 2020-06-09 09:32 GMT

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. గతవారం రోజులుగా దేశంలో నిత్యం 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

పాజిటివ్‌ కేసుల విషయంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాను మించిపోయింది. చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో కేసుల సంఖ్య 85,975కు చేరింది. తాజాగా కరోనా కారణంగా బృహన్‌ ముంబయి డిప్యూటీ కమిషనర్‌ కన్నుమూశారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ అని తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ముంబయి నీటి సరఫరా విభాగంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News