MP Priyanka Gandhi: బిహార్‌ విద్యార్థులపై లాఠీఛార్జ్.. ప్రభుత్వ తీరుపై విమర్శలు

MP Priyanka Gandhi condemned police lathi charge on students in Bihar: బీహార్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-12-30 10:45 GMT

MP Priyanka Gandhi condemned police lathi charge on students in Bihar: బీహార్‌లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఖండించారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలిలో విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. బీహార్‌లో మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండు సార్లు విద్యార్థులపై దాడులకు దిగిందని ఫైరయ్యారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్‌లు, పేపర్ లీక్‌లను అరికట్టడం తమ బాధ్యత అనే విషయాన్ని నితీష్ ప్రభుత్వం (Bihar Govt) మరిచిపోయిందని ప్రియాంక విమర్శించారు. జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పోరాడుతుంటే వారిని అణచివేయడానికి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ యత్నిస్తుందని ప్రియాంక మండిపడ్డారు.

మరోవైపు ఈ ఘటనపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని.. సోషల్ మీడియాలో వీడియోలను చూస్తుంటే వారెంత బాధను అనుభవించారో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటనను నిరంకుశ ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణగా ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అభివర్ణించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులతో పోలీసులు దారుణంగా ప్రవర్తించడం ప్రభుత్వ నియంతృత్వాన్ని మరోసారి ప్రజలకు తెలియజేసిందన్నారు. విద్యార్థిగా ఎన్నో ఉద్యమాలు చేసి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నితీశ్ కుమార్ ప్రభుత్వం నుంచి ఈ ప్రవర్తనను తానెప్పుడూ ఊహించలేదన్నారు. విద్యార్థులతో అధికారులు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Tags:    

Similar News