కలికాలం.. ఐదుగురు పిల్లల తల్లి నలుగురు పిల్లల తండ్రితో జంప్..!

Viral News: కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తుందన్న ప్రజలు రాక మానదు.

Update: 2025-04-10 08:19 GMT

కలికాలం.. ఐదుగురు పిల్లల తల్లి నలుగురు పిల్లల తండ్రితో జంప్..!

Viral News: కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తుందన్న ప్రజలు రాక మానదు. మానవత్వం, సంస్కారం అన్న పదాలకు అసలు అర్థమే లేదన్నట్లుగా కొందరి తీరు మారుతోంది. ప్రేమించిన వాడి కోసం కన్న బిడ్డలను చంపుతుంది ఓ తల్లి, ప్రేమికుడి కోసం కట్టుున్న భర్తను చంపి బ్యారెల్‌లో పూడ్చి పెడుతోంది మరో భార్య. ఇలాంటి సంఘటనలు రోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఇలాంటి ఓ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌ జిల్లా మహారియా గ్రామానికి చెందిన గీతా అనే ఐదుగురు పిల్లల తల్లి ఏప్రిల్‌ 5వ తేదీన తన భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు తీసుకొని అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రి గోపాల్‌తో కలిసి పారిపోయింది. అంతటితో ఆగకుండా, వారిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం అందరికి తెలిసిపోయింది.

తన భార్య పుట్టింటికి వెళ్లి ఉండొచ్చని తొలుత అనుకున్న భర్త శ్రీచంద్, మూడు రోజులకు ఫేస్‌బుక్‌లో ఆమె పెళ్లి ఫోటోలు చూసి షాక్‌కు గురయ్యాడు. ఆ ఫోటోలు వైరల్‌గా మారడంతో కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీచంద్‌కి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని పెద్ద కూతురికి దాదాపు 19 ఏళ్లు కాగా, చిన్న కూతురికి ఐదు సంవత్సరాలు మాత్రమే. ఒకప్పుడు ముంబైలో వడాపావ్‌ దుకాణంలో పని చేసిన శ్రీచంద్ ప్రస్తుతం తన స్వగ్రామంలో కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

ఇక గీతతో పారిపోయిన గోపాల్ కూడా వివాహితుడే. అతనికి నలుగురు పిల్లలున్నారు. గోపాల్ గతంలో ముంబైలో రాఖీ తయారీ సంస్థలో పనిచేసేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతను కుటుంబ ఖర్చులు ఇవ్వడం లేదని అతని భార్య వాపోయింది. తానే ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తూ పిల్లల్ని పోషిస్తున్నట్టు చెప్పింది. ఇక తన భార్య తీసుకెళ్లిన నగలు, రూ.90 వేల నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీచంద్ భావోద్వేగంగా స్పందించాడు. అలాగే ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అయితే ఇప్పటివరకు ఇద్దరి కుటుంబాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

Tags:    

Similar News