ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్తుల హతం

హత్య , దొంగతనం వంటి తీవ్ర నేరాల్లో ప్రమేయమున్న ఇద్దరు నేరస్తులు సోమవారం ఉదయం ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

Update: 2020-02-17 07:50 GMT

హత్య , దొంగతనం వంటి తీవ్ర నేరాల్లో ప్రమేయమున్న ఇద్దరు నేరస్తులు సోమవారం ఉదయం ఢిల్లీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. పుల్ పెహ్లాద్ పూర్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు, నేరస్థులకు మధ్య ఎక్స్చేంజి అఫ్ ఫైర్ జరిగిందని.. ఈ ఘటనలో ఇద్దరు నేరస్థులు మరణించినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని వారు తెలిపారు.

ఎన్‌కౌంటర్ సందర్భంగా గాయపడిన రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌లను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిని వైద్యులు చనిపోయినట్లు ప్రకటించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) పిఎస్ కుష్వా తెలిపారు. నేరస్థులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులను తాకాయని.. కాని వారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉండటంతో పెద్దగా గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం రఫీక్ కరావాల్ నగర్ లోని ఒక ప్రాపర్టీ డీలర్ షాపుపై కాల్పులు జరిపారు.. దాంతో ఓ వ్యాపారి మృతిచెందాడు.. ఈ క్రమంలో కరవాల్‌నగర్‌ మర్డర్‌ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. అయితే అనూహ్యంగా వారు ఇవాళ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు.


Tags:    

Similar News