Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Parliament Session: ఆగస్టు 11 వరకూ కొనసాగనున్న సమావేశాలు
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో జరగనున్నాయి. 21 కొత్త బిల్లులు, 7 పాత బిల్లులను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ పై పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి అంశంపై చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోందనీ, అయితే.. ఏ బిల్లులను ఆమోదించాలి అనేది తరువాత నిర్ణయిస్తామని అన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజు మణిపూర్ హింసాకాండతోపాటు ఇతర సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ప్రధాని మోడీ సమక్షంలోనే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాలు అనేక సూచనలు చేశాయని, తమ కూటమి నేతలు కూడా పలు సూచనలు ఇచ్చారని, మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున అన్ని పార్టీలు తెలిపాయని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్లమెంట్ సజావుగా సాగేందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశామని అఖిలపక్ష సమావేశం అనంతరం జోషి తెలిపారు.