బీజేడీ మాజీ ఎమ్మెల్యే పై ఈడీ కేసు నమోదు

బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనం నాయక్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం కేసు నమోదు చేసింది. జనవరి 23న కోరాపుట్ విజిలెన్స్ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2020-03-07 05:35 GMT

బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనం నాయక్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం కేసు నమోదు చేసింది. జనవరి 23న కోరాపుట్ విజిలెన్స్ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 1.54 కోట్ల రూపాయల అక్రమాస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణతో. అనం నాయక్పై కేసు నమోదైంది మరియు మనీలాండరింగ్ అంశాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది అని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు.

రాజకీయాల్లోకి రాకముందు నాయక్ జూనియర్ గుమస్తాగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు ఆ తరువాత 1985 జనవరి లో రెవెన్యూ శాఖలో పదోన్నతి సాధించారు. అతను మార్చి 30, 2004 వరకు కలహండి జిల్లాలోని వివిధ కార్యాలయాల్లో పనిచేశాడు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుండి 2019 వరకు భవానీపట్న అసెంబ్లీ నియోజకావర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. అవినీతి ఆరోపణలపై అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించింది బీజేడీ.

కేసులపై స్పందించిన సదరు ఎమ్మెల్యే.. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ దాఖలు చేసేటప్పుడు తన డిక్లరేషన్ రూపంలో తన ఆస్తి మరియు ఆదాయపు పన్ను రిటర్నుల వివరాలను అందించానని పేర్కొన్నారు. వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, పూర్వీకుల ఆస్తి కూడా వచ్చిందని పేర్కొన్నారు.. అరెస్టు తరువాత ఫిబ్రవరి 26 న ఒరిస్సా హైకోర్టు నుండి బెయిల్ పొందరాయన.


Tags:    

Similar News