బీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు

Bihar Crime News: పాట్నాలో నివాసం సహా నాలుగు చోట్ల విజిలెన్స్ దాడులు

Update: 2022-06-26 03:30 GMT

బీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు

Bihar Crime News: అవినీతి అధికారుల ధనదాహనికి అంతు ఉండదనే దానికి ప్రత్యేక్ష నిదర్శనం ఈ ఘటన. వారికి ప్రభుత్వమిచ్చే జీతం కంటే.. అక్రమంగా సంపాదించే లంచం పైనే మక్కువ. అవినీతి అధికారుల ధన దాహం ఏ స్థాయిలో ఉంటుందో.. ఓ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి ఘటనే బీహార్ రాష్ట్రం పాట్నాలో చోటుచేసుకుంది. ఓ డ్రగ్ అధికారిపై దాడి చేసిన విజిలెన్స్ అధికారులకు దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో నగదు బయటపడింది.

అక్రమాస్తుల కేసులో డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ జితేంద్ర కుమార్ నివాసం సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు 3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీ కట్టలన్నింటీనీ బెడ్డుపై పోసి.. గంటల కొద్దీ లెక్కపెట్టారు. పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా బంగారం, వెండి, నాలుగు లగ్జరీ కార్లను సీజ్ చేశారు. 2011 నుంచి విధుల్లో చేరిన డ్రగ్ ఇన్ స్పెక్టర్ జితేంద్రకుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జెహానాబాద్ లోని ఘోన్సీలోని అతని ఇల్లు, గయా పట్టణంలోని ఫ్లాట్ లు, దానాపూర్ లోని అతని ఫార్మసీ కళాశాల, పాట్నా సిటీలో కొత్తగా నిర్మించిన ఇంటిపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. 

Full View


Tags:    

Similar News