నేడు గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌లో.. గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న మోడీ

PM Modi: హాజరుకానున్న 34 దేశాల కీలక నేతలు, ప్రతినిధులు

Update: 2024-01-10 01:58 GMT

నేడు గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌లో.. గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న మోడీ

PM Modi: సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో రెండో రోజు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించునన్నారు. గాంధీనగర్‌ మహాత్మా మందిర్‌లో, గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్‌కు 34 దేశాల కీలక నేతలు, ప్రతినిధులు హజరుకానున్నారు. సమ్మిట్‌ను ప్రారంభించిన తర్వాత, ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈఓలతో మోడీ సమావేశమై, ఆపై గిఫ్ట్ సిటీకి వెళతారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రధాని మోడీ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో ప్రభావవంతమైన వ్యాపార నాయకులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ నేటి నుంచి ఎల్లుండి వరకు గాంధీనగర్‌లో జరగనుంది.

Tags:    

Similar News