Narendra Modi: ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి వారణాసికి మోడీ
Narendra Modi: జూన్ 18న వారణాసికి వెళ్లనున్న ప్రధానమంత్రి మోడీ
Narendra Modi: ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి వారణాసికి మోడీ
Narendra Modi: ప్రధాని మోడీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ ఆయన రైతుల సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని తెలిపాయి. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. వారణాసిలోని రోహానియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతు సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. వేదిక ఏర్పాటుకు స్థలం ఎంపిక జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వారణాసి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామన్నారు.