PM Modi: ట్రంప్‌ టారిఫ్‌ల పెంపు.. స్పందించిన ప్రధాని మోదీ.. రాజీపడే ప్రసక్తే లేదు..

PM Modi: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లు పెంచిన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు.

Update: 2025-08-07 04:48 GMT

PM Modi: ట్రంప్‌ టారిఫ్‌ల పెంపు.. స్పందించిన ప్రధాని మోదీ

PM Modi: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లు పెంచిన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమానికి ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భారతదేశం గతంలో అమెరికా డెయిరీ ఉత్పత్తుల దిగుమతిని తిరస్కరించింది. ఇలాంటి దిగుమతులు భారతదేశంలోని స్థానిక రైతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని కేంద్ర ప్రభుత్వం అప్పుడే స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని పురస్కరించుకొని, ఏర్పడిన వాణిజ్య విభేదాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై టారిఫ్‌లు పెంచినట్లు భావిస్తున్నారు.

దేశీయ వ్యవసాయాన్ని, రైతుల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యతని ప్రధానమంత్రి తన వ్యాఖ్యల ద్వారా సున్నితంగా తెలియజేశారు.

Tags:    

Similar News