Narendra Modi: త్రిపురలో ఎన్నికల ర్యాలీలో మోడీ బిజీ
Narendra Modi: త్రిపురలో రూ.3 వేల కోట్ల వ్యయంతో హైవే అభివృద్ధి చేస్తాం
Narendra Modi: త్రిపురలో ఎన్నికల ర్యాలీలో మోడీ బిజీ
Narendra Modi: ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీలు, ప్రచార సభలతో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ త్రిపురలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, వామపక్షాలపై మోడీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఎన్డీఏ పాలన కొనసాగిందన్నారు. అదే కాంగ్రెస్, వామపక్షాల పాలనతో త్రిపుర దోపిడీకి గురైందని ఆరోపించారు. రాబోయే కాలంలో దేశంలో పేదల కోసం కొత్తగా మూడు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఇందులో త్రిపుర ప్రజలు సైతం ప్రయోజనం పొందనున్నట్టు మోడీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో హైవే కనెక్టివిటీ పెంచడంపై బీజేపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. త్రిపురలో జాతీయ రహదారుల అభివృద్ధికి 3 వేల కోట్లకపైగా ఖర్చు చేయనున్నామన్నారు.