Narendra Modi: నలంద యూనివర్సిటీ ప్రారంభించిన మోడీ
Narendra Modi: పుస్తకాలు మంటల్లో కాలిపోతాయి... జ్ఞానం కాదు
Narendra Modi: నలంద యూనివర్సిటీ ప్రారంభించిన మోడీ
Narendra Modi: నలంద విశ్వవిద్యాలయం భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి చిహ్నం అని ప్రధాని మోడీ అన్నారు. బిహార్‌లోని రాజ్‌గిరిలో నలంద యూనివర్సిటీ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. పురాతన శిథిలాల నుంచి నలంద పునరుజ్జీవించిందని కొనియాడారు. కొత్త క్యాంపస్ భారత్ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందన్నారు. అగ్ని కీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు కాని జ్ఞానం కాదని వివరించారు మోడీ.