Priyanka Gandhi: మోడీ దేశ సంపద అంతా కొద్దిమంది చేతుల్లో పెట్టారు
Priyanka Gandhi: ఎన్డీఏకి 400, బీజేపీకి 370 సీట్లు వస్తాయని ముందే ఎలా చెబుతారు
Priyanka Gandhi: మోడీ దేశ సంపద అంతా కొద్దిమంది చేతుల్లో పెట్టారు
Priyanka Gandhi: ప్రధాని మోడీ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. దేశ సంపద అంతా అతికొద్ది మంది చేతుల్లో మోడీ పెట్టారని ఆమె విమర్శించారు. ఎన్డీఏ పాలనలో చిన్న, మధ్య తరగతి వ్యాపారులు రోడ్డున పడ్డారని ప్రియాంక ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు, బీజేపీకి 370 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ముందే ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. బీజేపీ నేతలేమైనా జ్యోతిష్యులా అని ప్రియాంక ఎద్దేవా చేశారు. పోలింగ్ సమయంలో ఏదైనా కుట్ర చేయకుండా బీజేపీ మళ్లీ అధికారంలోకి రాలేదని, బీజేపీకి కనీసం 180 సీట్లు కూడా రావని ప్రియాంక స్పష్టం చేశారు.