Mizoram Assembly Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్
Mizoram Assembly Election Results: తేలనున్న 174 మంది అభ్యర్థుల భవితవ్యం
Mizoram Assembly Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్
Mizoram Assembly Election Results: మిజోరం ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. కౌంటింగ్ కేంద్రాల నుండి ముందస్తు లీడ్‌లు రావడంతో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ZPM, ముఖ్యమంత్రి జోరంతంగా నేతృత్వంలోని అధికార MNF కంటే ముందుంది. ఇప్పటివరకు ZPM 26, MNF10, BJP 3, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్‌లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 40 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 18 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీ 21 సీట్లను దాటాలి. అధికార మిజో నేషనల్ ఫ్రంట్, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్, కాంగ్రెస్ 40 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మిజోరంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. 17 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగ్గా, మిగిలిన నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండింది. కానీ క్రైస్తవ- మెజార్టీ జనాభాకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున భారత ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును ఇవాళ్టికి వాయిదా వేసింది. 2018లో ఎంఎన్‌ఎఫ్ 26 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. ZPM ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 2013లో గెలిచిన 34 స్థానాలతో పోలిస్తే కేవలం ఐదు సీట్లతో సరిపెట్టుకుంది.