Aadhaar: మీ ఆధార్‌ కార్డుని ఎవరైనా ఉపయోగిస్తున్నారా.. ఇలా తెలుసుకోండి..!

Aadhaar: నేటికాలంలో ఆధార్‌ కార్డు అనేది చాలా ముఖ్యమైన పత్రం.

Update: 2022-04-23 11:03 GMT

Aadhaar: మీ ఆధార్‌ కార్డుని ఎవరైనా ఉపయోగిస్తున్నారా.. ఇలా తెలుసుకోండి..!

Aadhaar: నేటికాలంలో ఆధార్‌ కార్డు అనేది చాలా ముఖ్యమైన పత్రం. దీన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఏ పని కావాలన్నా అది ఆధార్‌తో ముడిపడి ఉంటుంది. అయితే కొంతమంది మీ ఆధార్‌ కార్డుని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఇది మీకు చాలా ప్రమాదకరం. మీ ఆధార్‌ కార్డుని ఎవరైనా వాడుతున్నారని మీకు అనుమానం వస్తే మీరు తనిఖీ చేయవచ్చు. మీ ఆధార్ కార్డ్ ఎప్పుడు ఎక్కడ ఉపయోగించబడిందో భారత విశిష్ట గుర్తింపు అథారిటీ యూఐడీఏఐ (UIDAI) అధికారిక సైట్‌లో తనిఖీ చేయవచ్చు. దీనికి ఎటువంటి రుసుము ఉండదు. ఉచితంగా సమాచారాన్ని పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఇలా తెలుసుకోండి..

1. ముందుగా ఆధార్ వెబ్‌సైట్‌పై (uidai.gov.in) క్లిక్ చేయండి.

2. ఇక్కడ ఆధార్ సర్వీసెస్ దిగువన ఆధార్ హిస్టరీ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

3. ఇక్కడ ఆధార్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి OTP పై క్లిక్ చేయండి.

4. తరువాత ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానిని ఇక్కడ ఎంటర్‌ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.

5. తరువాత అడిగిన మొత్తం సమాచారం అందించాలి.

6. అప్పుడు మీకు ఒక జాబితా కనిపిస్తుంది. అందులో గత 6 నెలల్లో ఆధార్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించరో మొత్తం వివరాలు ఉంటాయి.

ఆధార్ కార్డు దుర్వినియోగం అయినట్లు మీకు అనిపిస్తే, ఫిర్యాదు రికార్డు చూసిన తర్వాత, మీరు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. మీరు టోల్ ఫ్రీ నంబర్ 1947 లేదా ఇమెయిల్ help@uidai.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా uidai.gov.in/file-complaint లింక్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

Tags:    

Similar News