China: అరుణాచల్‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం..

Miran Taron: అరుణాచల్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్‌ను చైనా సైన్యం కిడ్నాప్‌ చేసిందన్న వార్తలు కలకలం సృష్టించాయి.

Update: 2022-01-23 10:16 GMT

China: అరుణాచల్‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం.. 

Miran Taron: అరుణాచల్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్‌ను చైనా సైన్యం కిడ్నాప్‌ చేసిందన్న వార్తలు కలకలం సృష్టించాయి. తాజాగా అతడి ఆచూకీ తెలిసింది. చైనా సైన్యం అతడిని గుర్తించిందని భారత సైన్యం తెలిపింది. అతడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నామని తేజపూర్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ హర్షవర్దన్‌ పాండే తెలిపారు.

అప్పర్ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన మిరామ్‌ తరోన్‌, అతడి స్నేహితుడు జానీ యాయింగ్‌ను చైనా సైన్యం అపహరించారు. అయితే జానీ యాయింగ్‌ తప్పించుకొన్నాడు. ఈ విషయాన్ని ఎంపీ గావ్‌ ట్వీటర్‌లో తెలిపాడు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎంపీ కోరారు. ఆమేరకు రంగంలోకి దిగిన ఆర్మీ మూడ్రోజుల్లో మిరామ్‌ ఆచూకీని గుర్తించింది.

Tags:    

Similar News