కొనసాగిస్తున్న ఇండియా-చైనా మిలటరీ కమాండర్ల చర్చలు

తూర్పు లడఖ్‌లోని ఇండో, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారతీయ, చైనా సైనిక కమాండర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

Update: 2020-06-06 07:52 GMT

తూర్పు లడఖ్‌లోని ఇండో, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారతీయ, చైనా సైనిక కమాండర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.ఈ సమావేశం చైనాలోని మోల్డోలో జరుగుతుంది. ఇందులో భారతదేశం నుండి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ , చైనా వైపు నుండి మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొన్నారు. కాగా లియు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ జోన్ కమాండర్ గా ఉన్నారు. అంతకుముందు శుక్రవారం సాయంత్రం, ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల అధికారుల మధ్య సంభాషణ జరిగింది.

అలాగే సైనిక మరియు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగాయి, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ శుక్రవారం మాట్లాడుతూ.. సరిహద్దులో భారత్-చైనా మధ్య పరిస్థితి స్థిరంగా ఉందని నియంత్రించదగినదని అన్నారు. సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం తమకు పూర్తి విధానాలు ఉన్నాయని.. సైనిక మరియు దౌత్య పద్ధతిలో చర్చలను కూడా కొనసాగిస్తామని.. ఈ సమస్యను మంచి వాతావరణంలో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Tags:    

Similar News