Layoffs: ఉద్యోగులకు బిగ్ షాకిచ్చిన ప్రముఖ కంపెనీ..వేలాది మంది ఉద్యోగులు తొలగింపు
Layoffs: ఉద్యోగులకు బిగ్ షాకిచ్చిన ప్రముఖ కంపెనీ..వేలాది మంది ఉద్యోగులు తొలగింపు
Layoffs: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల దగ్గర నుంచి చిన్న సంస్థల వరకు అన్నీ లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. కొవిడ్ సమయంలో అధికంగా చేపట్టిన నియామకాలు ఒక కారణం అయితే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వస్తున్న మార్పులు మరో రీజన్ అని చెప్పవచ్చు. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల సంఖ్యలో 3శాతం తగ్గించున్నట్లు ప్రకటించింది.
కంపెనీని మరింత ప్రొడక్టివ్ గా, ఎఫీషియెంట్ గా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత రెండేళ్లలో ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇదే అతిపెద్దది అవడం గమనార్హం. మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగుల తొలగింపు వివరాలు, వాటి ప్రభావం, టెక్ ఇండస్ట్రీలోని ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం.
కంపెనీని మరింత ప్రొడక్టివ్ గా, ఎఫీషియెంట్ గా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత రెండు సంవత్సరాల్లో ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇదే అతిపెద్దది. మైక్రో సాఫ్ట్ లో ఉద్యోగుల తొలగింపు వివరాలు, వాటి ప్రభావం, టెక్ ఇండస్ట్రీలోని ట్రెండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ వర్క్ ఫోర్స్ 3శాతం తగ్గించడం ద్వారా సుమారు 6,800 ఉద్యోగులను తొలగించేస్తోంది. జూన్ 2024 నాటికి సంస్థలో 2,28,000 మంది ఉద్యోగులు ఉండగా... ఈ లేఆఫ్స్ అన్ని లెవెల్స్ లో టీమ్స్ లో దేశాల్లో ఇంపాక్ట్ చూపుతాయి. ప్రధానంగా మేనేజ్ మెంట్ లేయర్స్ ను తగ్గించడం, సంస్థను మరింత ఎఫీషియెంట్ గా మార్చడమే ఈ లేఆఫ్స్ లక్ష్యం. సీఎన్ బీసీ ప్రకారం..ఈ లేఆఫ్స్ పెర్మార్మెన్స్ కు సంబంధించిన కావు. స్ట్రాటజిక్ రీస్ట్రక్చరింగ్ లో భాగం మాత్రమే. 2023లో పది వేల మంది ఉద్యోగాలను తొలగించిన తర్వాత ఇదే అతిపెద్ద లేఆఫ్స్ అవ్వడం గమనార్హం.