Mehul Choksi: మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ
Mehul Choksi: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
మెహుల్ చోక్సీ(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
Mehul Choksi: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం చోక్సీ వేసిన పిటిషన్‌ను స్వీకరణకు నిరాకరించింది. పిటిషన్‌లో చోక్సీ ఎలాంటి బలమైన హామి ఇవ్వలేకపోయాడన్న కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. తన సోదరుడితో పాటు హోటల్లో ఉంటానని చోక్సీ తెలపడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. అతను దేశం విడిచిపోయే అవకాశం లేదని చోక్సీ కుటుంబం తెలిపినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇక భారత్‌కు పంపాలని వేసిన పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు వాయిదా వేయడంతో చోక్సీకి కాస్త ఊరట లభించింది.