NEET: కోటాలో మరో ఘోరం.. మరో విద్యార్థి సూ*సైడ్!
NEET: ప్రభుత్వం అన్యాయ మార్గాలు ఉపయొగించే విద్యార్థులపై Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
NEET: కోటాలో మరో ఘోరం.. మరో విద్యార్థి సూ*సైడ్!
NEET: NEET-UG పరీక్షకు ఒక రోజు ముందే రాజస్థాన్‌లోని కోటాలో 17 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహ*త్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ విద్యార్థిని, గత రెండు సంవత్సరాలుగా కోటాలోని ఓ కోచింగ్ సెంటర్‌లో NEET పరీక్ష కోసం శ్రమిస్తోంది. శనివారం రాత్రి ఆమె తన గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించగా, వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రాథమికంగా స్పందిస్తూ, విద్యార్థిని ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోందని తెలిపారు. వారు ప్రభుత్వ ఉపాధ్యాయులని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించిన పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని చెప్పారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో కోటాలో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో కోచింగ్ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 14కి చేరింది. గత సంవత్సరం మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా 5,453 కేంద్రాల్లో, 22.7 లక్షల మంది విద్యార్థులు NEET-UG పరీక్ష రాస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. కేంద్రంలోని వివిధ విభాగాల సమన్వయంతో జామర్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం జరిగిన పేపర్ లీక్ వంటి అంశాలపై ఆరోపణల నేపథ్యంలో ఈసారి మరింత నిఘా కొనసాగుతోంది.
ప్రభుత్వం అన్యాయ మార్గాలు ఉపయొగించే విద్యార్థులపై Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి ఘటనలు మానసిక ఆరోగ్యం పై మరింత అవగాహన పెరగాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. యువత విద్యలో విజయం కోసం శ్రమించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ ఒత్తిడిని ఎదుర్కొనడానికీ సమర్థవంతమైన మద్దతు వ్యవస్థలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.