కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వినాయక చవితి రోజున మాంసం విక్రయం నిలిపివేత

Ganesh Festival: పాఠశాలలు, కాలేజీల్లో హిజాబ్ ధరించొద్దన్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కర్ణాటక ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

Update: 2022-08-29 10:39 GMT

కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వినాయక చవితి రోజున మాంసం విక్రయం నిలిపివేత

Ganesh Festival: పాఠశాలలు, కాలేజీల్లో హిజాబ్ ధరించొద్దన్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కర్ణాటక ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ ఆగస్టు 31న రాష్ట్ర రాజధాని బెంగళూరులో మాంసం విక్రయాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజున మీట్ బ్యాన్ పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బొమ్మై సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి. మాంసం తీసుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయమని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటోంది. అదో ఫూలిష్ నిర్ణయమన్న కాంగ్రెస్ నాన్ వెజ్ తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది వారికే వదిలేయాలని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News