Karregutta: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..22 మంది మావోయిస్టులు దుర్మరణం
Karregutta: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..22 మంది మావోయిస్టులు దుర్మరణం
Karregutta: తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించారు. ఈ మేరకు అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఘటనాస్థలంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపాయి.
ఈ ఆపరేషన్ ను డీఆర్జీ, కోబ్రా,సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్విస్తున్నాయి. దీన్ని ఏడీజీ వివేకానంద సిన్హా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఆర్ఫీఎఫ్ ఐజీ రాకేశ్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐపీ పి. సుందరరాజ్ ఎప్పటికప్పుడు ఆపరేషన్ పై ఆరా తీస్తున్నారు. మరణించివారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.