Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టుల ప్రెస్ నోట్
Chhattisgarh: పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ ప్రెస్ నోట్ రిలీజ్
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టుల ప్రెస్ నోట్
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ రిలీజయ్యింది. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం భూపేష్ బగేల్ అమలు చేయలేదని బస్తర్‌లో శిబిరాలు తెరిచి కంటోన్మెంట్‌లుగా మార్చారని, తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై లాఠీచార్జి చేశారని లేఖలో పేర్కొన్నారు. గిరిజనులను బలవంతంగా హిందువులుగా మార్చేసి అల్లర్లకు బీజేపీ పాల్పడుతోందని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో 2వేల,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నెలకు వెయ్యి రూపాయలు తగ్గించిందని ఆరోపించారు.