Jammu and Kashmir: లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హాను నియమిస్తూ ఉత్తర్వులు..

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్ నూతన గవర్నర్ ను మియమిస్తూ.. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జరీ చేసారు.

Update: 2020-08-06 05:40 GMT
Manoj Sinha (File Photo)

Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్ నూతన గవర్నర్ ను మియమిస్తూ.. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జరీ చేసారు. నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా మ‌నోజ్ సిన్హా నియమితులయ్యారు. ఇక ఇదిలా ఉండగా గత ఏడాది కాలంగా జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జీసీ ముర్మూ ఇటీవలే రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, త్వరలో జీసీ ముర్మూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పగ్గాలు చేపట్టే అవకాసం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది.

కాగా, ప్రస్తుతం ఆడిటర్ జనరల్ చెఫ్ గా పనిచేస్తున్న రాజీవ్ మెహరిషీ మరో వరం రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు.. అయితే, ఈ కార్యక్రమంలోనే జీసీ ముర్ము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా చేపట్టనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది(2019)లో జమ్ముకాశ్మీర్ పునర్విభజన చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. తరువాత ఆ ప్రాంతానికి తోలి గవర్నర్ గా జీసీ ముర్ము నియమితులయ్యారు.  

Tags:    

Similar News