Manish Sisodia: కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని మనీష్ ఆరోపణ
Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
Manish Sisodia: కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని మనీష్ ఆరోపణ
Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హత్యచేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికలకు ముందే అరవింద్ కేజ్రీవాల్‌ను నైతికంగా దెబ్బతీసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూశారు..బీజేపీ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కేజ్రీవాల్‌పై బెదిరింపులకు దిగుతున్నారన్నారు. బీజేపీ నేత మనోజ్ తివారీ బెదిరింపులు చూస్తుంటే కేజ్రీవాల్‌ను అంతమొందించాలని చూస్తున్నట్లు అర్థమవుతోందన్నారు మనీష్ సిసోడియా.