Pahalgam Terrorist Attack: పహల్గామ్ ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి మృతి.. తప్పించుకునే ప్ర‌య‌త్నంలో..

Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు.

Update: 2025-05-05 08:20 GMT

Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు. భద్రాతా బలగాల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని నదిలో దూకాడు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహయం చేసినట్టు సమాచారంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుల్గాంలోని చాంగ్ మార్గలో ఉన్న అడవిలో తలదాచుకున్న టెర్రరిస్టులకు ఆహారం, ఆశ్రయందతో పాటు ఇతర సహాయం చేసినట్టు అంగీకరించాడు.

ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు సాయం చేస్తానని విచారణలో భద్రతా బలగాలను నమ్మించాడు. దీంతో పోలీసులు, ఆర్మీ బలగాలు అతని వెంట వెళ్లాయి. ఇదే క్రమంలో ఇంతియాజ్ సమీపంలోని నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొట్టుకుపోయి మునిగిపోయాడు. పోలీసులు విచారణకు తీసుకు వెళ్లి నదిలో తోశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతియాజ్ మృతిలో కుట్రకోణం ఉందంటూ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇంతియాజ్ నదిలో దూకుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇంతియాజ్ మృతిపై తప్పుడు ఆరోపణలను భద్రతా బలగాలు ఖండించాయి.

Tags:    

Similar News