Mamata Banerjee Announcement: కోవిడ్ తో మరణిస్తే.. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షలు: బెంగాల్ మమతా బెనర్జీ

Mamata Banerjee Announcement: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2020-07-16 16:00 GMT
Mamata Benarji Annocement for Govt Employees

Mamata Banerjee Announcement: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా కరోనాతో మరణిస్తే.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ కల్పిస్తామని ప్రకటించారు.

వెస్ట్ బెంగాల్ లో ఇప్పటి వరకు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మరణించారని సీఎం మమతా తెలిపారు. అంతేగాక, కరోనా పోరులో ముందు నడుస్తున్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా కరోనా బారిన పడి మరణిస్తే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు.

ఇక ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం తెలిపారు. కరోనాకు భయపడవద్దని సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.

త్వరలో టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని మమతా బెనర్జీ తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34,427 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,747 యాక్టివ్ కేసులున్నాయి. 20,680 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 1,000 మంది మరణించారు.

Tags:    

Similar News