Coronavirus Tika Vaccine updates: కరోనా తుక్కురేగ్గొట్టే ఆయుధం రెడీ అవుతోంది

Arun Chilukuri
Updated on: 3 July 2020 4:34 PM IST
Coronavirus Tika Vaccine updates: కరోనా తుక్కురేగ్గొట్టే ఆయుధం రెడీ అవుతోంది
X

Coronavirus Tika Vaccine updates: టీకా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మానవాళి ఆశగా ఎదురుచూస్తోంది. భ‍యాన్ని పొగొట్టి నిర్భయంగా బయట తిరిగే ఆయుధం కోసం నిరీక్షిస్తోంది. చేతులు కలపడానికి ఎలాంటి సంకోచం అవసరంలేని అస్త్రం కోసం వెయిట్‌ చేస్తోంది. మనసారా తుమ్మడానికి, దగ్గడానికి కళ్లుకాయలు కాసేలా చూస్తోంది. వీళ్లందరి నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. అతిత్వరలోనే ప్రపంచ జనాభా కోరుకునే బ్రహ్మాస్త్రం రాబోతోంది. అవును కరోనాకు దడ పుట్టించే వ్యాక్సిన్‌ త్వరలోనే రాబోతోంది. మహమ్మారిని నియంత్రించే టీకా మన ముందుకు వస్తోంది. కరోనా మందుకు ముందడుగులు పడుతున్నాయి. అంతా సవ్యంగా జరిగితే మూడు నాలుగు నెల్లలోనే టీకా.. కరోనాను కాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సాధ్యాసాధ్యాలు ఏం చెబుతున్నాయ్‌? శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?

కరోనా తుక్కురేగ్గొట్టే ఆయుధం రెడీ అవుతోంది. జనాలను పీల్చిపిప్పి చేస్తున్న కోవిడ్‌ను, పాతాళానికి తొక్కేసే అస్త్రం సిద్దమవుతోంది. ఇక భయం అవసరం లేదు. అతిత్వరలోనే చైనా వైరస్‌క భారత్‌ టీకా రాబోతోంది. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, ప్రపంచ దిగ్గజ ఫార్మా కంపెనీలు. అన్ని దశలూ దాటుకుని, ల్యాబ్‌ నుంచి మందు బయటకు వస్తోందని నమ్మకంగా చెబుతూ, మానవాళికి గుడ్‌ న్యూస్ చెబుతున్నాయి. మరి ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది? అందులో మన పాత్ర ఎంత?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story