Mamata Banerjee: అచ్చేదిన్ అంటూ దేశాన్ని సర్వనాశనం చేశారు
Mamata Banerjee: అచ్చేదిన్ అంటూ దేశాన్ని సర్వనాశనం చేశారని కేంద్రంపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
Mamata Banerjee: అచ్చేదిన్ అంటూ దేశాన్ని సర్వనాశనం చేశారు
Mamata Banerjee: అచ్చేదిన్ అంటూ దేశాన్ని సర్వనాశనం చేశారని కేంద్రంపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతోందన్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు ఎలా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. జీఎస్టీ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం గోవాలో మకాం వేసిన దీదీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమస్యలను పరిష్కరించాలనే సోయి కేంద్ర ప్రభుత్వానికి లేదని విమర్శలు గుప్పించారు.