Mamata Banerjee: హ్యాకింగ్ భయంతో ఫోన్‌కు ప్లాస్టర్ వేశా
Mamata Banerjee: దేశరాజకీయాల్లో పెగాసస్ ప్రకంపనలు రేపుతోంది.
Mamata Banerjee: హ్యాకింగ్ భయంతో ఫోన్‌కు ప్లాస్టర్ వేశా
Mamata Banerjee: దేశరాజకీయాల్లో పెగాసస్ ప్రకంపనలు రేపుతోంది. నేతల ఫోన్ల హ్యాకింగ్‌తో బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి విపక్షాలు. తాజాగా బెంగాల్ సీఎం దీదీ కూడా మోడీ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. తన ఫోన్‌ను బీజేపీ హ్యాక్ చేస్తుందని ఆరోపించారు. హ్యాకింగ్ భయంతో తన ఫోన్‌కు ప్లాస్టర్ వేశానన్న మమతా బెనర్జీ కేంద్రం స్పైగిరి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఫోన్ల హ్యాకింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. పెగాసస్ చాలా ప్రమాదకరం. వాళ్లు వ్యక్తులను హింసిస్తున్నారు. కొన్నిసార్లు నేను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఢిల్లీ లేదా ఒడిశా చీఫ్ మినిస్టర్‌లతో మాట్లాడలేకపోతున్నానని ఆమె అన్నారు.