Waqf Amendment Bill: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌‌కు మల్లిఖార్జున్ ఖర్గే ఛాలెంజ్

Mallikarjun Kharge Counter: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌‌కు మల్లిఖార్జున్ ఖర్గే ఛాలెంజ్ విసిరారు.

Update: 2025-04-03 07:45 GMT

Mallikarjun Kharge Counter: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌‌కు మల్లిఖార్జున్ ఖర్గే ఛాలెంజ్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. నిన్న వక్ఫ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్.. కర్ణాటకలో వక్ఫ్‌ భూముల గోల్‌మాల్‌లో ఖర్గే ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై ఖర్గే తీవ్రంగా స్పందించారు.

అనురాగ్ ఠాకూర్ ఆరోపణలపై మండిపడిన ఖర్గే.. మచ్చ లేని నేతగా తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఏనాడూ ఏ నాయకుడు తనపై అవినీతి ఆరోపణలు చేయలేదని తెలిపారు. అలాంటి తనపై ఆరోపణలు చేసిన అనురాగ్ ఠాకూర్.. ఆ ఆరోపణలను నిరూపించాలన్నారు. లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News