మావోయిస్టుల ఏరివేత కోసం దండకారణ్యంలోకి మహిళా జవాన్లు

మాములుగా అయితే మావోయిస్టుల ఏరివేత కోసం... దండకారణ్యంలోకి భద్రతా దళాలుగా పురుషులను మాత్రమే పంపిస్తారు.

Update: 2020-03-08 04:50 GMT

మాములుగా అయితే మావోయిస్టుల ఏరివేత కోసం... దండకారణ్యంలోకి భద్రతా దళాలుగా పురుషులను మాత్రమే పంపిస్తారు. అందులో కూడా మంచి స్పెషలిస్టులనే ఎంపిక చేసి పంపిస్తారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే వారినే కూంబింగ్‌కు దండకారణ్యంలోకి పంపిస్తారు. కానీ మహారాష్ట్రలో పరిస్థితి ఇందుకు బిన్నంగా ఉంది. మావోయిస్టుల ఏరివేతకు మహిళా జవాన్లు రంగంలోకి దిగారు.

నక్సలిజాన్ని అంతం చేస్తామని నడుం బిగించారు.. గడ్చిరౌలీలోని డీప్‌ ఫారెస్టులో మావోయిస్టుల కదలిక ఉందన్న సమాచారంతో.. మహిళా భద్రతా దళాలు కూంబింగ్‌కు వెళ్లారు. నక్సల్స్‌ కోసం అడవిలో వేట కొనసాగించారు. అక్కడి గిరిజన గ్రామాల ప్రజలతో మమేకమై.. నక్సల్స్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టిసారించారు. ఈ మహిళా అధికారుల ప్రధాన పని ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం మరియు నక్సల్స్‌కు సంబంధించిన అన్ని వార్తలు డీకోడ్ చెయ్యడం.. ఈ ఆపరేషన్ లో వారు స్థానిక గిరిజనులతో మాట్లాడి వారిని చైతన్య పరుస్తారు.

ఈ మహిళా అధికారులు కూడా గ్రౌండ్ లెవల్లో పనిచేయాలని మరియు దండకారణ్యంలోకి ప్రవేశిస్తారని, అవసరమైనప్పుడు ఏరివేత కార్యకలాపాలను చేపడతారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే, గాడ్చిరోలి జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతంలో, నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉంది, అయితే అంకితభావం మరియు సంకల్పం తమకు అడుగడుగునా విజయాన్ని ఇస్తుందని మహిళా అధికారుల నమ్ముతున్నారు. అతివలు ఎందులోనూ తక్కువ కాదని మహారాష్ట్ర మహిళా భద్రతా దళాలు నిరూపించాయని పలువురు మహిళలు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News