సినిమా షూటింగ్స్‌కు మహారాష్ట్ర సర్కార్ అనుమతి..

కరోనా వైరస్ కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2020-06-01 04:47 GMT

కరోనా వైరస్ కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ 5.0లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. కొన్ని షరతులతో దాదాపు అన్ని పరిశ్రమల్నీ ప్రారంభించుకోవచ్చని ప్రకటించింది. జూన్ 8 వ తేదీ నుంచి షాపింగ్ మాల్స్‌కు , దేవాలయలు ప్రార్ధనామందిరాలకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొద్ది మందితో షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలో సినిమాలు, టెలీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, వాణిజ్య ప్రకటనల సంబందించిన షూటింగ్స్‌ జరుపుకోవచ్చని ప్రభుత్వం పేర్కోంది. షూటింగ్ జరుపుకునే విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలనీ తెలిపింది. నిర్మాతలు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రోడక్షన్ పనులను నిబంధనల ప్రకారం చేసుకోవచ్చు. షూటింగ్స్ జరుపుకోవాలంటే ఆయా జిల్లాకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. సినిమా సెట్స్, ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా చూడటంతోపాటు భౌతిక దూరం పాటించాలని తెలిపింది. టాలీవుడ్ ప్రముఖులు షూటింగులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎంను కలిసిన సంగతి తెలిసిందే. 


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News