Delivery Agent Urinates: మహారాష్ట్రలో ఒక బిల్డింగ్ లిఫ్ట్‌లో ఆ పాడు పని చేసి దొరికిపోయిన డెలివరీ బాయ్.. పోలీసులను ఆశ్రయించిన రెసిడెన్స్
Delivery Agent Urinates: ఈ మధ్య డెలివరీ బాయ్స్ చేస్తున్న అరాచకాలు సీసీటీవీ కెమెరాల్లో ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. తాజాగా ఒక డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు లిఫ్ట్‌లో వెళుతున్న సమయంలో యూరిన్ పోశాడు
Delivery Agent Urinates: మహారాష్ట్రలో ఒక బిల్డింగ్ లిఫ్ట్‌లో ఆ పాడు పని చేసి దొరికిపోయిన డెలివరీ బాయ్.. పోలీసులను ఆశ్రయించిన రెసిడెన్స్
Delivery Agent Urinates: ఈ మధ్య డెలివరీ బాయ్స్ చేస్తున్న అరాచకాలు సీసీటీవీ కెమెరాల్లో ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. తాజాగా ఒక డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు లిఫ్ట్‌లో వెళుతున్న సమయంలో యూరిన్ పోశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీలో రికార్డ్ అయింది. దీంతో వెంటనే ఆ బిల్డింగ్‌లో నివసిస్తున్నవారంతా పోలీసులను ఆశ్రయించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్ వెస్ట్లోని ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంది. అయితే క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ లిఫ్ట్‌లో ఆర్డర్‌ని డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఇలా లిఫ్ట్‌లో వెళుతున్న సమయంలో లిఫ్ట్‌లో మూత్ర విసర్జన చేస్తుండగా ఈ మొత్తం ఘటన లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి విరార్ వెస్ట్‌లోని బోలింజ్ పోలీస్ స్టేషన్‌లో రెడిడెన్స్ ఫిర్యాదు నమోదు చేయగా.. అధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు.
లిఫ్ట్‌లో కొంతమంది స్థానికులు ఎక్కిన తర్వాత ఒకటే యూరిన్ స్మెల్ రావడాన్ని గుర్తించారు. ముందు ఏదైనా కుక్కల పనేమో అనుకున్నారు. అందుకే ఒకసారి సీసీటీవీ చెక్ చేద్దామని చూశారు. కానీ సీసీటీవ్ చెక్ చేసిన షాక్ తిన్నారు. ఎందుకంటే డెలివరీ ఇవ్వడానికి డెలివరీ బాయ్ ఆ పాడు పనిచేశాడు. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చిన యువకుడు భవనంలోని లిఫ్ట్ లోపల మూత్ర విసర్జన చేస్తున్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన రెడిడెన్స్ షాక్ తిన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది మరియు ఈ సంఘటన తర్వాత నివాసితులు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ కార్యాలయానికి వెళ్లి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను ప్రశ్నించారు మరియు తరువాత అతన్ని కొట్టినట్లు సమాచారం.