PM Modi At Maha Kumbh: పుణ్యస్నానం చేసిన మోదీ
PM Modi At Maha Kumbh: నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లో బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు.
PM Modi At Maha Kumbh: పుణ్యస్నానం చేసిన మోదీ
PM Modi At Maha Kumbh: నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లో బుధవారం ఉదయం పుణ్యస్నానం చేశారు. మహాకుంభమేళాను పురస్కరించుకొని ప్రధాని ఇవాళ ఉదయం ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు ఆయన బోట్ లో ప్రయాణించారు. ఆ తర్వాత పుణ్యస్నానం చేశారు. భీష్మ అష్టమి రోజున మహాకుంభమేళాకు మోదీ హాజరయ్యారు. ప్రదాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం పార్లమెంట్ కు సెలవు ఇచ్చారు. దీంతో మోదీ మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి వచ్చారు. పుణ్యస్నానం చేసిన తర్వాత యూపీలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి ఆయన తిరిగి దిల్లీకి వెళ్తారు.
మంగళవారం నాడు భూటాన్ రోజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్ చుక్ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. ఆయనకు యూపీ సీఎం స్వాగతం పలికారు. మహాకుంభమేళాలో జనవరి 29న తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి . ఇదే విషయమై పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న విపక్షాలు ఆందోళనకు దిగాయి.