Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో కీలక పరిణామం.. ఈరోజు రాత్రి ఏడు గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు..

మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ నిమగ్నమైంది.

Update: 2020-03-20 10:52 GMT
Shivraj Singh Chouhan (file photo)

మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ నిమగ్నమైంది. ఇవాళ రాత్రి ఏడు గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించారు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్. బీజేపీ శాసనసభా పక్ష నేతగా శివరాజ్ సింగ్ చౌహన్ ను ఎన్నుకునే అవకాశం ఉంది. అన్నీ కుదిరి ఆయన మరోసారి బాధ్యతలు చేపడితే నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన రికార్డు ఆయనకు దక్కుతుంది. 30 నవంబర్ 2005 న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎన్నికయ్యారు. 2013 శివరాజ్ ఎంపిలో వరుసగా మూడోసారి గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా శివరాజ్ కు ప్రత్యేక స్థానం ఉంది.

విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్.. మొదటి రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా తన సేవలను ప్రారంభించారు. తన 13 సంవత్సరాల వయస్సులో 1972 లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తన సేవలను వివిధ రూపాల్లో అందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని విడిషా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. శివరాజ్‌ ఎమర్జెన్సీ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. బయటకు వచ్చిన తరువాత ఎబివిపిలో చురుకుగా పనిచేశారు.

Tags:    

Similar News