ఆదివారం స్పీకర్ ను కలవనున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు!

మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. జైపూర్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్‌కు తిరిగి వస్తారని భావిస్తోంది.

Update: 2020-03-14 13:49 GMT

మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. జైపూర్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్‌కు తిరిగి వస్తారని భావిస్తోంది. అందుచేత ఆదివారం కాంగ్రెస్ శాసనసభ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వాన్ని కాపాడే వ్యూహంపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పి ప్రజాపతి కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించారు..

బీజేపీ శిభిరంలో ఉన్న ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు ఇచ్చారు.. మార్చి 15 లోగా హాజరు అయ్యి వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు బిజెపి గవర్నర్‌ను కలుసుకుని ఫ్లోర్ టెస్ట్ జరపాలని కోరారు. కాగా ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా తాజాగా మరోసారి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నాను, కాని మొదటగా బీజేపీ శిభిరంలో ఉన్న ఎమ్మెల్యేలను విడిపించాలని అన్నారు.

మొత్తం 22 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు.. వీరిని మూడు వేర్వేరు తేదీలలో హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులందుకున్న సదరు ఎమ్మెల్యేలు మార్చి 15 సాయంత్రం 5 గంటల లోపు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ ముందు హాజరుకాకపోతే ప్రభుత్వం బల పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News