Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

Lok Sabha Elections: తొలి విడతలో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు

Update: 2024-03-20 04:33 GMT

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

Lok Sabha Elections: దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి మొదలవుతోంది. ఏడుదశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.తొలిదశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలిదశ పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ వెలువడింది. దాంతో పాటే ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

ఈనెల 27వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశముంటుంది. 28వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 30వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంటుంది. లోక్‌సభ తొలిదశ ఎన్నికల్లో మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు కూడా తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. తర్వాత రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు... తొలిదశలో 12 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

ఇక 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో తొలి దశలో 8 స్థానాలకు, మద్యప్రదేశ్‌లో 6, అస్సోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ము కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కో లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.

Tags:    

Similar News