2024 Lok Sabha Elections: తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తి

2024 Lok Sabha elections: తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

Update: 2024-04-19 11:40 GMT

2024 Lok Sabha Elections: తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తి

2024 Lok Sabha elections: తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు తొలివిడతలో పోలింగ్ నిర్వహించారు. 102 లోక్‌సభ స్థానాల్లో వెయ్యి 625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించగా... తొలివిడతలో అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సైతం పోలింగ్ పూర్తి అయింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అభ్యర్థుల ఏజెంట్‌ల ముందు ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలించనున్నారు. జూన్ 4న దేశమంతటా ఒకేసారి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Tags:    

Similar News