కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా లాక్ డౌన్ విధించి ప్రజలను ఇంటికే పరిమితం చేసి కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అదే ప్రయత్నాన్ని కొనసాగించనుంది. అయితే, మొదటి రెండు దఫాల్లా కాకుండా ఈసారి కొన్నినిబంధనలను సడలించింది. రేపట్నుంచి (మే 4) నుంచి మరో పద్నాలుగు రోజులు అంటే మే 17 వరకూ ఈ మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతుంది.
జాతీయ స్థాయిలో మూడో దఫా లాక్ డౌన్ కు నిబంధనలు చాలా వరకూ సవరించారు. లాక్ డౌన్ 1, 2 లానే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ పూర్తి స్థాయి నిషేధం విధించారు. కొన్ని చోట్ల 144 సెక్షన్ కూడా ఈ సమయంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇక కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి నాలుగు జోన్లుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రజా జీవనాన్ని నియంత్రించి కరోనా కట్టడికి ముందుకు సాగనున్నారు. కంటైన్మెంట్ జోన్ లో ఏరకంగానూ ప్రజల్ని బయటకు రావడానికి అనుమతించరు. అయితే, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మాత్రం వెసులుబాటు ఇచ్చారు. అదే విధంగా రెడ్ జోన్ లో కొన్ని సౌకర్యాలపై నిషేధం కొనసాగుతుంది. ఇక ఆరెంజ్, గ్రీన్ జోన్లల్లో చాలా వరకూ జనజీవనాన్ని సామాన్య స్థితికి తెచ్చే విధంగా ఆంక్షల సడలింపు ఇచ్చారు. అయితే, ఈ సడలింపులకు కొన్ని పరిమితులు కూడా విధించారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలనే నిబంధన తప్పనిసరి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యధాతథంగా ఉపయోగించుకోవచ్చు. లేదా స్థానిక పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్రం కేవలం గైడ్ లైన్స్ మాత్రమె ఇచ్చింది. వాటిని అమలు చేయాల్సిన విషయంలో ఎలా ఏమిటి అనేదానిని రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ నిబంధనల్ని దాదాపుగా మాలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైపోయింది. ఇప్పటికే దానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. మద్యం దుకాణాలు రేపట్నుంచి తెరుచుకోనున్నాయి.
ఇటు తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ 2 ఇంకా ఈ నెల 7 వతేదీ దాకా కొనసాగనుంది. ఈ నిర్ణయం చాలారోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా.. కేంద్రం లాక్ డౌన్ 3 విషయంలో ఇచిన మార్గదర్శనాలు ఎలా తెలంగాణలో కొనసాగించాలి అనే విషయంపై తెలంగాణా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈనెల 5 వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరగనుంది ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ మే 7 వ తేదీ వరకూ యదాతథ పరిస్థితులు కొనసాగించే అవకాశాలే ఉన్నాయి.
ఇక కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు ఏఏ కార్యకలాపాలకు అనుమతి ఉంది.. వేటికి లేదు అనే అంశాలు ఈ క్రింది పట్టికలో మీకోసం వివరంగా ఇస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శనాల ఆధారంగా తయారు చేసిన పట్టిక..