RJD-LJD: 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన మిత్రులు

RJD-LJD: ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం

Update: 2022-03-21 06:02 GMT

ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం

RJD-LJD: లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ RJD పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ LJD పార్టీ విలీనమైంది. న్యూఢిల్లీలో ఈ విలీన కార్యక్రమం జరిగింది. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు శరద్ యాదవ్ చెప్పారు. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావడం తప్పనిసరి అని అన్నారు. ప్రస్తుతానికి ఏకీకరణ తమ ప్రాధాన్యత అని.. తర్వాత మాత్రమే ఐక్య ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దాని గురించి ఆలోచిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ద్వేషం వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్జేడీ నేత, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ ప్రసాద్ యాదవ్. సోదరభావం ప్రమాదంలో పడిపోయిందన్నారు.

ధరల పెరుగుదల కొనసాగుతుందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను పార్టీల విభాగాలు మార్చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శరద్ యాదవ్ ఆయన పార్టీని ఆర్జేడీలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం తమకు మరింత బలం, విశ్వాసాన్ని అందజేస్తాయని విశ్వాసం కలిగిస్తోంది. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఓ సందేశాన్ని పంపుతుందన్నారు.

Tags:    

Similar News