లలిత్ మోదీకి పౌరసత్వం: ఏంటీ వనౌటు దేశ ప్రత్యేకత?

Lalit Modi: పసిఫిక్ ద్వీప దేశం వనౌటు‌లో ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోదీ పౌరసత్వం పొందారు.

Update: 2025-03-08 10:15 GMT

Lalit Modi: పసిఫిక్ ద్వీప దేశం వనౌటు‌లో ఐపీఎల్ వ్యవస్థాపకులు లలిత్ మోదీ పౌరసత్వం పొందారు. దీంతో ఈ దేశం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. లలిత్ మోదీ తన పాస్‌పోర్ట్ ను లండన్ లోని భారత హైకమిషన్ కు అప్పగించేందుకు ధరఖాస్తు చేసుకున్నారు.దీంతో పాటు వనౌటు పౌరసత్వాన్ని లలిత్ మోదీ పౌరసత్వం పొందారని విదేశాంగ మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.

వనౌటులో గోల్డెన్ పాస్ పోర్ట్

వనౌటులో పాస్ పోర్టు కొనుగోలు చేసుకొనే వెసులుబాటు ఉంది. గోల్డెన్ పాస్ పోర్టు కింద వనౌట్ లో పౌరసత్వం పొందవచ్చు. వనౌటు పౌరసత్వం కావాలంటే 1.18 కోట్ల నుంచి 1.35 కోట్ల వరకు ఉంటుంది. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి పౌరసత్వం దక్కాలంటే 30 నుంచి 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకున్నా కూడా సిటిజన్ షిప్ పొందొచ్చు. దేశంలో అడుగు పెట్టకుండానే పాస్ పోర్టు లభిస్తోంది. అత్యంత వేగవంతమైన, చౌకగా పౌరసత్వం అందించే దేశాల్లో వనౌటు ఒకటి. పౌరసత్వం ద్వారా 40 శాతం ఆదాయం ఈ దేశం పొందుతోంది. సిటిజన్ షిప్ కోసం చాలా తక్కువ పత్రాలను మాత్రమే ఈ దేశం అడుగుతోంది.

వనౌటును లలిత్ మోదీ ఎందుకు ఎంచుకున్నారు?

లలిత్ మోదీ ఐపీఎల్ లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తును తప్పించుకొనేందుకు ఆయన వనౌటు దేశ పౌరసత్వం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.వనౌటులో మూడు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటుంది. వనౌటు పాస్ పోర్టు కలిగి ఉంటే యుకె, యూరోపియన్ సహా 120 కంటే ఎక్కువ దేశాల్లో వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది. గత రెండేళ్లలో 30 మంది భారతీయులు ఈ దేశంలో పౌరసత్వం సంపాదించారు. ఈ దేశం నుంచి ఎక్కువగా చైనా వాసులు ఎక్కువ పాస్ పోర్టులు పొందారు.

ఎలాంటి పన్నులు ఉండవు

ఈ దేశంలో ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు. స్టాక్స్, రియల్ ఏస్టేట్, కార్పోరేట్ సంస్థల ద్వారా చేసే వ్యాపారాలకు సంబంధించి వచ్చిన డబ్బుపై కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఈ దేశంలో ఏదైనా వ్యాపార సంస్థను ప్రారంభించి ఇతర దేశాల ద్వారా కార్యకలాపాలు ప్రారంభించినా కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన ఇబ్బందులు ఉండవు.

Tags:    

Similar News