ముందెళ్లి క్షమాపణ చెప్పండి.. కల్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌

Update: 2025-05-15 07:46 GMT

ముందెళ్లి క్షమాపణ చెప్పండి.. కల్నల్ సోఫియాపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్‌

Colonel Sofiya Qureshi: భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్‌’ పై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sophia Qureshi) పై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్‌ షా (Kunwar Vijay Shah) చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన మంత్రి “ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచారు… వాళ్ల మతానికి చెందిన సోదరిని మోదీ సైనిక విమానంలో పాక్‌కు పంపించి పాఠం చెప్పారు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి.

ఈ వ్యవహారం హైకోర్టు వరకు చేరి, మంత్రి పై కేసు నమోదైంది. తాజాగా సుప్రీంకోర్టు లోకి వెళ్లిన విజయ్ షా పిటిషన్‌ను రేపు (శుక్రవారం) విచారించనున్నట్లు తెలిపింది. అయితే, కోర్టు “మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ముందు హైకోర్టులో క్షమాపణ చెప్పండి. ఇలాంటి అంశాల్లో సున్నితంగా వ్యవహరించండి” అంటూ మంత్రి తీరుపై సీరియస్ అభిప్రాయం తెలిపింది.

జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) కూడా ఈ ఘటనపై కఠినంగా స్పందించింది. దేశ రక్షణలో ఉన్న మహిళా అధికారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని, బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News