మరొకరికి బైక్‌ ఇచ్చేముందు ఈ నిబంధన తెలుసుకోండి.. లేదంటే రూ.25,000 జరిమానా..!

Motor Vehicle Act: మన దేశంలో చాలామంది బైక్‌లు, కార్లని ఉపయోగిస్తారు.

Update: 2022-11-10 04:43 GMT

మరొకరికి బైక్‌ ఇచ్చేముందు ఈ నిబంధన తెలుసుకోండి.. లేదంటే రూ.25,000 జరిమానా..!

Motor Vehicle Act: మన దేశంలో చాలామంది బైక్‌లు, కార్లని ఉపయోగిస్తారు. చాలా సార్లు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మిమ్మల్ని బైక్ లేదా కారు అడుగుతారు. మనం ఎందుకు.. ఏమిటీ అని అడగకుండానే వాహనాన్ని ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల అతడిపై ప్రేమ చూపించిన వారువుతారు కానీ తర్వాత రూ.25000 ఫైన్‌ కట్టాల్సివస్తుంది. అవును మీరు చదివింది నిజమే. మీకు ట్రాఫిక్ రూల్ గురించి తెలియకపోతే తెలుసుకోండి. మీరు వాహనాన్ని ఇచ్చిన వ్యక్తి మైనర్ అయితే ఈ నియమం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇందుకోసం జైలుకు వెళ్లాల్సి రావచ్చు.

మైనర్ డ్రైవింగ్ చేసినందుకు జరిమానా

భారతీయ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వయస్సు 18 సంవత్సరాలు. ఇంతకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి దేశంలోని రోడ్లపై వాహనం నడుపుతున్నట్లు తేలితే అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తారు. అలాగే వాహనం నడిపిన డ్రైవర్ 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు.

చలాన్ పొందిన 15 రోజుల్లోగా వాహన యజమాని-డ్రైవర్ జరిమానాను జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే జిల్లా సెషన్స్ కోర్టు చర్య తీసుకుంటుంది. అందువల్ల డ్రైవింగ్ చేయడానికి చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలను డ్రైవింగ్ చేయడానికి అనుమతించాలి. నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు ఎలాంటి వాహనాలు నడపకూడదు. అయితే 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల మైనర్లు గేర్ లేని వాహనాలను నడపవచ్చు.

Tags:    

Similar News