Kishan Reddy: స్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న కిషన్ రెడ్డి

Kishan Reddy: సరిహద్దు సమస్యలను పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి హామీ

Update: 2022-10-09 12:23 GMT

Kishan Reddy: స్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న కిషన్ రెడ్డి

Kishan Reddy: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలాగే ఈశాన్య రాష్ట్రాల్లోనూ స్థిరమైన ప్రభుత్వాలు ఉంటేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈశాన్య రాష్ట్రల మౌలిక అభివృద్ధికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అస్సాం రాజధాని గువాహటిలో రెండు రోజుల ఈశాన్య రాష్ట్రాల 70వ ప్లీనరీ సమావేశాల్లో మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదన్నారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు శాంతియుత రాష్ట్రాలని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సరిహద్దు సమస్యలను అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Tags:    

Similar News