కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ

Kiran Kumar Reddy: ఢిల్లీ పర్యటనలో కిరణ్‌కుమార్‌ రెడ్డి బిజీబిజీ

Update: 2023-04-08 14:30 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ

Kiran Kumar Reddy: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. నిన్న పార్టీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇవాళ జాతీయ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో భేటీ అయ్యారు కిరణ్‌కుమార్‌రెడ్డి. తాజా రాజకీయాలపై అమిత్‌షాతో సుదీర్ఘంగా చర్చించారు ఆయన.

అలాగే.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాజకీయాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో పనిచేసే అంశాలపై అమిత్‌షా, బీఎల్‌ సంతోష్‌తో చర్చించారు. ఇక.. నిన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు కిరణ్‌కుమార్‌ రెడ్డి.

Tags:    

Similar News