Kerala Woman Act of Kindness gets Her New House: ఆమె సేవను మెచ్చి.. యజమాని ఏం బహుమతి ఇచ్చారో తెలుసా..

kerala woman act of kindness gets her new house: సరిగ్గా పది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయింది. ఇప్పుడు ఆ వీడియో నెటిజన్ల ఫోన్లలో చెక్కర్లు కొడుతుంది

Update: 2020-07-16 15:31 GMT
kerala woman act of kindness gets her new house

Kerala Woman Act of Kindness gets Her New House: సరిగ్గా పది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయింది. ఇప్పుడు ఆ వీడియో నెటిజన్ల ఫోన్లలో చెక్కర్లు కొడుతుంది. అంతే కాదు నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు ఈ వీడియోను చూసిన వారు అందులో ఉన్న వారికి ఓ ఇల్లును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అసలు ఆ విడియోలో ఏముంది అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. రోడ్డుపైన ఓ బస్సు ఆగి, అప్పుడే కదులుతుంది. అయితే ఆ బస్సులో ఎక్కడానికి ఓ అంధుడు ప్రయత్నిస్తాడు. అది చూసిన ఓ మహిళ బస్సు వెనకాలే పరిగెత్తి ఆపి మరీ ఆ అంధుడిని బస్సు ఎక్కించింది. ఆ సీన్ ని ఎవరో తెలియదు కానీ చక్కగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. దీంతో ఆమె పేరు గత పది రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. తన ఉద్యోగి సేవా గుణాన్ని మెచ్చిన యజమాని ఆమెకు ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చారు.

కేరళ తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువళ్లకు చెందిన సుప్రియ అనే మహిళ. ఆమె స్థానికంగా ఉండే ఆలుకాస్ సంస్థలో ఉద్యోగి. అయితే ఆమె చేసిన మంచి పనిని కొనియాడుతూ నెటిజన్లు దేశవిదేశాల నుంచి ప్రశంసిస్తున్నారు. ఆ తరువాత ఆ వీడియోను సుప్రియ యజమాని కూడా చూసి ఆయన కూడా ఆమె ఔదార్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. ఆ తరువాత ఆలుకాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ ఆలుకాస్ ఆమె ఇంటికి నేరుగా వెళ్లారు. అనంతరం ఆమెను అభినందించారు. ఆ తరువాత ఓ చిన్న కిరాయి ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సుప్రియను చైర్మన్ వారం తరువాత త్రిస్సూర్ కు రావాలని ఆహ్వానించారు. తన బాస్ పిలుపు మేరకు సుప్రియ త్రిస్సూర్ వెళ్లింది. అక్కడ సుప్రియ చైర్మన్ జాయ్ అలుకాస్, అతని సతీమని జొల్లి ఆలుకాస్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిప్ట్ గా ఇచ్చిన ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది.

అయితే సుప్రియ పరిగెత్తుతూ వెళ్లి అంథుడిని బస్ ఎక్కించే వీడియోను తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాదు ఆమె ఈ ప్రపంచాన్ని జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చారు. ఆమె చూపిన దయ ఎంతో అందమైనది.. అని కాప్షన్ ను కూడా జోడించారు. ఆయన ట్వీట్ ని చూసిన బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఆమెలాగెనే మనమంతా మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమిద్దాం అని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News