Road Accident in Tamil nadu: ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

Road Accident in Tamil nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా, టిండివనం సమీపంలో గురువారం తెల్లవారుజామున వారి కారు గుంటలో పడటంతో ఆరుగురు మృతి చెందారు

Raj
By Raj
Published on: 16 July 2020 2:13 PM IST
Road Accident in Tamil nadu: ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి
X

Road Accident in Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా, టిండివనం సమీపంలో గురువారం తెల్లవారుజామున వారి కారు గుంటలో పడటంతో ఆరుగురు మృతి చెందారు. బాధితులను సి మురుగన్, (40) అతని భార్య మలార్, (35) సి మురుగరాజ్, (38) సి శ్రీ మురుగన్, కారు డ్రైవర్ మరియు ఒక మైనర్ గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మరో ఇద్దరు పిల్లలు కూడా వాహనంలో ఇర్రుక్కుపోయారు. తీవ్ర గాయాల పాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. కన్యాకుమారి నుంచి చెన్నైకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, విల్లుపురం జిల్లాలోని టిండివనం సమీపంలోని పత్తిరి గ్రామంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.. దాంతో రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో కారు పడిపోయింది , కాని కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సమీపంలో ఎవరూ లేకపోవడంతో వారిని గుర్తించలేదు. దాంతో బోల్తాపడిన వాహనాన్ని చాలా సమయం తరువాత స్థానికులు కొందరు కనుగొన్నారు. దీంతో వారు టిండివనం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.

ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్‌తో సహా ఆరుగురు మరణించినట్లు గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు పిల్లలను టిండివనం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించేందుకు మృతదేహాలను కూడా అదే ఆసుపత్రికి పంపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయిందని, ఇది ఘోర ప్రమాదానికి దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. విల్లుపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్ రాధాకృష్ణన్, టిండివనం డిఎస్పి కనగేశ్వరి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి ఆరా తీశారు.

Raj

Raj

Next Story