అతను 'కరోనావైరస్' తో మరణించలేదు: కేరళ వైద్యులు

శుక్రవారం ఫ్లూ మరియు న్యుమోనియా లక్షణాలతో కొచ్చిన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు.

Update: 2020-02-29 10:52 GMT
ప్రతీకాత్మక చిత్రం

శుక్రవారం ఫ్లూ మరియు న్యుమోనియా లక్షణాలతో కొచ్చిన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వాస్తవానికి ఆ ముందు రోజే అతను మలేషియా నుండి కొచ్చిన్‌కు వచ్చాడు. చనిపోయే ఒకరోజు ముందు అతనికి కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఇందులో అతనికి కరోనా వైరస్ సోకలేదని తేలింది. అయినా అతను నీరసంగా ఉండటంతో అతన్ని గురువారం రాత్రి కొచ్చిన్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ హఠాత్తుగా అతను చనిపోయాడు. దాంతో అతను కరోనా వైరస్ కారణంగా మరణించాడని వైద్యులంతా ఖంగారు పడ్డారు.

నిజానికి అతను ఫ్లూ, న్యుమోనియా కారణంగా మరణించినట్టు ఉన్నత వైద్యులు తెలిపారు. కాగా గత మూడు సంవత్సరాలుగా మలేషియాలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అతను న్యుమోనియాతో బాధపడుతున్నాడు. పైగా అతను డయాబెటిస్ పేషేంట్ అని.. కొన్ని రోజులుగా అతనికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ అయ్యాయి. ఈ కారణంతోనే అతను మరణించినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ గణేష్ మోహనన్ అన్నారు. దీంతో వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News