Coronavirus Safety Rules: తస్మాత్ జాగ్రత్త : మాస్కు ధ‌రించ‌క‌పోతే 10 వేలు జ‌రిమానా.. రెండేళ్ల జైలు శిక్ష

Coronavirus Safety Rules: లాక్ డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2020-07-05 15:15 GMT
Representational Image

Coronavirus Safety Rules: లాక్ డౌన్ సడలింపుల తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రల నుంచి రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. క్రమక్రమంగా తన వ్యాప్తిని పెంచుకుంటున్న కరోనాని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠిన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే కేరళ ప్రభుత్వం మరికొన్ని కఠిన కీలక నిర్ణయాలను తీసుకుంది.

కరోనా స్వీయ నియంత్రణలో భాగం అయిన మాస్క్ ను కచ్చితంగా ధరించాలని కేరళ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. లేనిచొ రూ.10 వేల జరిమానా విధిస్తామని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. అలాగే రెండేళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు సైజును బట్టి సంఖ్యను తగ్గించాలని చెప్పుకొచ్చింది. ఇక రోడ్ల పైన, పబ్లిక్ ప్లేసులలో ఉమ్మివేయరాదు అని వెల్లడించింది.

అటు పెళ్లిళ్లకు 50 మంది మించి హాజ‌రు కాకూడదని, ఇక పెళ్లి వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని పెళ్ళికి వెళ్ళిన వారు కూడా మాస్క్ ధరించాలని చెప్పుకొచ్చింది. అలాగే అంత్యక్రియ‌ల‌కు కూడా 20 మందికి మించి హాజ‌రు కావొద్దు అని అక్కడి ప్రభుత్వం నిబంధనలను జారీ చేసింది. ఇక ఈ రూల్స్‌ మరో సంవత్సరం పాటు కొనసాగనున్నాయని స్పష్టం చేసింది.

కరోనా తీవ్రతను అడ్డుకోవడానికి కేరళ మొదటినుంచి వినూత్నంగానే వ్యవహరిస్తూవస్తోంది. భారత్ లో తొలి కరోనాకేసు నమోదు అయింది అక్కడే.. గత కొద్ది రోజులుగా అక్కడ జీరో కేసులు నమోదు కాగా, మళ్ళీ అక్కడ భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కరోనా కేసుల విషయనికి వచ్చేసరికి అక్కడ కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి 5,204కు చేరుకుంది.

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల విషయనికి వచ్చేసరికి శనివారం ఒక్కరోజే 24,850పైగా కేసులు నమోదు కాగా, 613 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదయిన కరోనా మరణాల్లో రెండో అత్యధికం..క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతంగా ఉండ‌గా మ‌ర‌ణాల రేటు 2.9శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,73,165గా చేరగా.. మరణాల సంఖ్య 19,268మందికి చేరింది. కరోనా నుంచి 4.09 లక్షల మంది కోలుకోగా.. 2,44,814లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News